ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాడు నేడు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో గల స్కూల్స్ అన్నిటిని దశలవారీగా నవీకరిస్తుంది. ఇందులో భాగంగా స్కూల్స్ అన్నింటిలో 11 రకాల పనులను జరిపి సదుపాయాలను కల్పించింది. రన్నింగ్ వాటర్ తో కూడిన టాయిలెట్లు తాగునీటి సరఫరా పెద్ద చిన్న మరమ్మత్తులు ఫ్యాన్లు ట్యూబ్లైట్లతో విద్యుత్ కర్ణ విద్యార్థులు మరియు ఉపాధ్యాయులకి స్కూల్స్లో పరిశుభ్రత నిర్వహణ కొరకు ఆయాలు నియమించింది మరుగుదొడ్లను శుభ్రపరిచేందుకు రసాయనాలు సాధనాలను కూడా ప్రభుత్వం అందించింది.
ఇప్పుడు అన్ని నాడు నేడు హై స్కూల్స్ యొక్క సౌకర్యాలను పరిసరాలను రక్షణ కల్పించడానికి భద్రంగా ఉంచడానికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ అలానే స్కూల్స్ పరిసరాల్లో అసంఘిక కార్యక్రమాలను నిరోధించడానికి ప్రభుత్వం ఒక హై స్కూల్ కి ఒకరు చొప్పున మొత్తం 538 మంది నైట్ వాచ్మెన్ లో నియమించడానికి ఆదేశాలు జారీ చేసింది డి ఈ ఓల ఆధ్వర్యంలో ఈ నియామకాలు జరుగుతాయి నైట్ వాచ్మెన్ గా పనిచేసేవారు 6000 గౌరవ వేతనం పొందుతారు.
అర్హతలు:
1.నైట్ వాచ్మెన్ లను పేరెంట్స్ కమిటీ ద్వారా నియమిస్తారు
2.ఇప్పటికే నియమించబడ్డ ఆయా భర్తకి మొదటి ప్రాధాన్యత ఇస్తారు.
4.అదే గ్రామంలో లేదా వార్డులో నివసిస్తున్న ఎక్స్ సర్వీస్మెన్ కి రెండో ప్రాధాన్యత లభిస్తుంది.
5.పై ఇద్దరూ లేనట్లయితే పేరెంట్ కమిటీ మిగతా ఎవరినైనా నియమించవచ్చు.
6.స్థానిక గ్రామ నివాసి అయి ఉండాలి.
7.వయస్సు 60 సంవత్సరాల లోపు కలిగిన వారై ఉండాలి.
8.గౌరవ వేతనం 6000 లభిస్తుంది.
నైట్ వాచ్మెన్ నిర్వహించాల్సిన విధులు:
1.పాఠశాల మూసివేయడానికి ముందు సాయంత్రం పాఠశాలకు హాజరు కావాలి.
2.పని దినాల్లో మరుసటి రోజు పాఠశాల తెరిచే వరకు విధుల్లో ఉండాలి ఇతర రోజుల్లో పూర్తిస్థాయిలో విధుల్లో ఉండాలి సంబంధిత ప్రధాన ఉపాధ్యాయులు యొక్క పర్యవేక్షణలో పనిచేయాలి.
3.కాపలాదారు విధుల్లో ప్రధానంగా పాఠశాల యొక్క ఆస్తులు పాఠశాల భవనాలు మరియు ప్రాంగణానికి ఇతర వస్తువుల పరికరాలకు రక్షకుడిగా పని చేయాలి.
4.పాఠశాల ప్రాంగణంలోకి అనధికార వ్యక్తులు ఎవరు ప్రవేశించకుండా అసాధారణ కార్యక్రమాలు జరిగినప్పుడు అగ్నిప్రమాదం వంటివి ఏర్పడినప్పుడు ఏదైనా అనుమానం వచ్చినప్పుడు సంబంధిత హెడ్మాస్టర్ కు సమీప పోలీస్ స్టేషన్కు అగ్నిమాపక విభాగానికి నివేదించాలి.
5.సాయంత్రం వేళలో పాఠశాల యొక్క గార్డెన్ కు నీరు పోయాలి.
6.ఎప్పటికప్పుడు ఆర్వో ప్లాంట్ ను శుభ్రం చేయాలి.
7.పాఠశాల పని వేళాలు కానీ సమయంలో పాఠశాలకు సంబంధించిన మెటీరియల్ లను వస్తే వాటిని రిసీవ్ చేసుకుని ప్రధానోపాధ్యాయులకు అందించాలి.
8.స్కూలుకు సంబంధించి ప్రధానోపాధ్యాయులు చెప్పే ఇతర పనులు చేయాలి.
9.నైట్ వాచ్మెన్ పనిని హెడ్మాస్టర్ పేరెంట్స్ కమిటీ ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి.
10.వైట్ వాచ్మెన్ రిజిస్ట్రేషన్ సంబంధిత హెడ్మాస్టర్ ద్వారా చేపట్టాలి లను అనంతరం ఆ వివరాలను యాప్ లో అప్లోడ్ చేయాలి.