AP State Civil Supplies Jobs Notification 2023|Latest Jobs alerts: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది.ఈ నోటిఫికేషన్ ద్వారా టెక్నికల్ అసిస్టెంట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ హెల్పర్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అర్హత మరియు ఆసక్తి కలిగిన అభ్యర్థులు నేరుగా లేదా పోస్టు ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. మీ యొక్క సొంత జిల్లాలో ఉద్యోగం పొందే అవకాశము. ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు వయస్సు జీతము అప్లికేషన్ విధానము ఎంపిక విధానము పూర్తి వివరాలను కింద ఇవ్వడం జరిగింది చూసి దరఖాస్తు చేసుకోండి అదేవిధంగా కావలసినటువంటి ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ని ఇచ్చాను డౌన్లోడ్ చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగాలు ఇక్కడ ఉన్నాయ్ క్లిక్ చెయ్
Subscribe To My channel Telugu jobs 24
సొంత జిల్లా లో ఉద్యోగాలు కావాలి అనుకుంటే మా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అవ్వండి మీకు ప్రతి రోజు ఉద్యోగ సంచారం ఉచితంగా పొందవచ్చు.
ఈ ఉద్యోగాలు దేనికి సంబంధించినవి:
ఈ ఉద్యోగాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌరసరఫరాల శాఖకు సంబంధించినవి అనగా మీ గ్రామంలో ఉండే రేషన్ షాప్ సంబంధిత ఉద్యోగాలు కాబట్టి మీ గ్రామంలో ఉద్యోగం వచ్చే అవకాశం.
ఈ ఉద్యోగాలను పూర్తిగా కాంట్రాక్టు విధానంలో తీసుకోవడం జరుగుతుంది కాంట్రాక్టు రెండు నెలలు మాత్రమే ఉంటుంది.
విద్యా అర్హతలు:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన విద్యార్హతలు క్రింది విధంగా ఉన్నాయి.
- టెక్నికల్ అసిస్టెంట్ – Degree
- డేటా ఎంట్రీ ఆపరేటర్ – Degree
- హెల్పర్ – 8th class
ఉద్యోగ ఖాళీలు:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఉద్యోగ ఖాళీలు క్రింది విధంగా ఉన్నాయి.
టెక్నికల్ అసిస్టెంట్ – 169
డేటా ఎంట్రీ ఆపరేటర్ – 169
హెల్పర్ – 169
జీతం ప్యాకేజీ:
ఈ ఉద్యోగాలకు సంబంధించిన జీతం వివరాలు నోటిఫికేషన్ లో తెలియజేయలేదు. కాకపోతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారము జీతం కచ్చితంగా అందుతుంది.
అవసరమైన వయోపరిమితి:
ఈ నోటిఫికేషన్ నాటికి మీరు ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకున్నవారు మినిమం 18 సంవత్సరాలు నిండి ఉండాలి. 35 సంవత్సరాలు మించి ఉండరాదు. అప్పుడు ఈ నోటిఫికేషన్ కు అప్లై చేసుకోగలరు.
దరఖాస్తు చేయు విధానము ఫీజు వివరాలు:
చేయాలనుకునే వారు ముందుగా అప్లికేషన్ ఫామ్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అప్లికేషన్ ఫామ్ మీకు క్రింద ఇవ్వడం జరిగింది డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్నటువంటి అప్లికేషన్ ఫామ్ ని నింపి దానితోపాటు కొన్ని డాక్యుమెంట్స్ ని జత పరచాల్సి ఉంటుంది వాటిని కింద తెలియజేస్తాను చూడండి.
అప్లికేషన్ ఫామ్ ని పూర్తిగా నింపి జతపరచాల్సినటువంటి డాక్యుమెంట్స్ నీ జతపరిచి మీరు నేరుగా లేదా పోస్టు ద్వారా పంపించవచ్చు దరఖాస్తు ఫామ్ ని.
జతపరచాల్సిన డాక్యుమెంట్స్:
- పదవ తరగతి మార్క్స్ మెమో
- విద్యారత కలిగిన సర్టిఫికెట్ల జిరాక్స్
- స్టడీ సర్టిఫికెట్లు
- లేటెస్ట్ Caste సర్టిఫికెట్
- పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు
- ఆధార్ కార్డ్
పంపించాల్సినటువంటి చిరునామా:
District Civil Supplies Manager, Mikkilineni Sudheer babu Road, Governorpeta,Vijayawada 520002.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు ఎంపిక విధానం విద్యార్హతల్లో వచ్చిన మార్పుల ఆధారంగా ఉంటుంది. ఇటువంటి పరీక్షలు ఉండవు ఫీజు కూడా లేదు ఉచితంగా జాబ్ పొందే అవకాశం.
======== Important Links =============