SBI Youth For India Fellowship 2022 In Telugu

SBI Youth for India Fellowship 2022-23:

భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) – ఎన్‌జీఓల సహకారంతో ‘ఎస్‌బీఐ యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌’ ప్రోగ్రామ్‌ని నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాదికి సంబంధించి ఎస్‌బీఐ యూత్‌ ఫర్‌ ఇండియా ఫెలోషిప్‌-2022 కి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు https://youthforindia.org/ వెబ్‌సైట్‌ ద్వారా అప్లయ్‌ చేసుకోవాలి.

ఎంపిక విధానం: ఈ ఫెలోషిప్‌లకు సంబంధించి ఎంపిక ప్రక్రియలో మూడు దశలు ఉంటాయి. ఆన్‌లైన్‌ అసెస్‌మెంట్‌, పర్సనాలిటీ అసెస్‌మెంట్‌, ఇంటర్వ్యూల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అభ్యర్థులు ప్రిలిమినరీ దరఖాస్తులో వారి పూర్తి వివరాలు, విద్యార్హతలు, ప్రొఫెషనల్ బ్యాక్‌గ్రౌండ్ వివరించాలి. ఆ తర్వాత ఆన్‌లైన్ అసెస్‌మెంట్ స్టేజ్ ఉంటుంది. ఆన్‌లైన్ అసెస్‌మెంట్ పూర్తైన తర్వాత పర్సనాలిటీ అసెస్‌మెంట్, ఇంటర్వ్యూ ఉంటాయి. వేర్వేరు నేపథ్యం, వృత్తి, వ్యక్తిగత అంశాలను పరిగణలోకి తీసుకొని ఫెలోషిప్‌కు ఎంపిక చేస్తారు.

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణులు అర్హులు. నాయకత్వ లక్షణాలతోపాటు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ ఉండాలి.

గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఇబ్బందులపై అవగాహన తప్పనిసరిగా ఉండాలి.

వయసు: దరఖాస్తు నాటికి 21 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.

ఫెలోషిప్‌ ఖాళీలు: 100కు పైగా ఖాళీలున్నాయి.

ఫెలోషిప్‌ వ్యవధి: 13 నెలలు ఉంటుంది.

అంశం: రూరల్‌ డెవలప్‌మెంట్‌స్టయిపెండ్‌:

నివాస ఖర్చుల కోసం నెలకు రూ.15,000రవాణా ఖర్చుల కోసం నెలకు రూ.1,000అలవెన్సుల కింద రూ.50,000మెడికల్‌ ఇన్సూరెన్స్‌ ఉంటుంది.

అధ్యయనం చేయాల్సిన అంశాలు: విద్య, నీటి వనరులు, మహిళా సాధికారత, టెక్నాలజీ, సోషల్ ఆంట్రప్రెన్యూర్‌షిప్, సాంప్రదాయ కళలు, స్వయం పరిపాలన, ఆహార భద్రత, ఆరోగ్యం, ప్రత్యామ్నాయ ఇంధన వనరులు, పర్యావరణ పరిరక్షణ, గ్రామీణ జీవితం తదితర అంశాలపై అధ్యయనం చేయాల్సి ఉంటుంది.

Online Apply Link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *